విడుదల చేయండి నన్ను,
పోనివ్వండి...!తీసుకోండి నన్నుంచి
నా తప్పుడు అహంకారాన్ని.
తీసివేయండి నన్నుంచి...
ఆ గౌరవాలను
వాటి ప్రతి ఒక్కటి,
మీరు నాకు ఇచ్చినవే!
విడిపించండి నన్ను
ఇవి,
పూల క్రింద దాగి ఉన్న
ముల్లుల చిక్కుల నుండి..!
చూచే అవకాశం ఇవ్వండి నన్ను
రాత్రి నిశ్శబ్దంలో
దూరంగా... దూరంగా విస్తరించిన
అనంత నిశ్శబ్దాన్ని.
నా ఆత్మ పక్షి,
ఎగరనివ్వండి
చంద్రకాంతి రాత్రులలో!!
మేఘాల బంగారు లోయల్లో...
చేరనివ్వండి నన్ను,
అనంత నక్షత్రాన్ని...
నా అంతర్గత అనంతంలో...
నా మనసు నౌకను,
ఈ గాలుల అలలపై...
కలల ప్రపంచంలో...
తీసుకెళ్లనివ్వండి...
విడుదల చేయండి... నన్ను పోనివ్వండి..!
Comments